10 శాతం జీపీఏ సాధించిన బాలికలు

– అశ్వారావుపేట ఉత్తీర్ణత శాతం 86.3
– సత్తా చాటిన విద్యార్ధినులు..
– గిరిజన బాలికకు 10 జీపీఏ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెలువరించిన పదో తరగతి ఫలితాల్లో మండలంలోని విద్యార్ధులు  తమ సత్తా చాటారు.నాలుగు పాఠశాలలకు చెందిన నలుగురు బాలికలు 10 జీపీఏ సాధించిన ఘనత పొందారు.ఇందులో భీముని గూడెం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన జ్యోతి చందు 10 జీపీఏ సాధించింది.మండల వ్యాప్తంగా 20 పాఠశాలలోని బాలబాలికలు 77 మంది 9 కి పైగా జీపీఏ సాధించారు.మండల ఉత్తీర్ణత శాతం 86.3 గా నమోదు అయింది అని ఎం.ఈ.ఓ క్రిష్ణయ్య తెలిపారు. మండలంలో 20 పాఠశాలలకు చెందిన మొత్తం 641 మంది పరీక్షకు హాజరు కాగా  581 ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం శాతం 86.3 నమోదు అయింది. తెలుగు మీడియం లో 299 పరీక్ష రాయగా 284 ఉత్తీర్ణత పొందారు.తెలుగు మీడియం ఉత్తీర్ణత శాతం 95‌ నమోదు అయింది.ఆంగ్ల మీడియం లో 338 మంది పరీక్ష రాయగా  336 మంది పాస్ అయ్యారు.ఇంగ్లీషు మీడియంలో ఉత్తీర్ణత శాతం 99.4 నమోదు అయింది. భీముని గూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తో సహా గౌతమి,సూర్య,జవహర్ విద్యాలయాలకు చెందిన నలుగురు విద్యార్ధులు10 కి 10 జీపీఏ సాధించారు. సూర్య స్కూల్ – ఎస్కే షీమా కౌసిక్, గౌతమి స్కూల్ – ప్రీతిక ప్రిన్సెస్ జవహర్ విద్యాలయం – కే.పల్లవిఏజీ హెచ్ ఎస్ భీముని గూడెం – కే.జ్యోతి చందు ఉన్నారు.మండల వ్యాప్తంగా 77 మంది విద్యార్ధులు 9 కి పైగా జీపీఏ సాధించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన బాల బాలికలను ఎం.ఈ.ఓ క్రిష్ణయ్య తో పాటు,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, చలపతిరావు,పోతన రాంబాబు,ప్రవీణ్ లు,తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.