జిల్లాలో ఉన్నతంగా నిలుస్తున్న అశ్వారావుపేట కళాశాల..

– స్థానికుల సహకారం మరువలేనిది..

– ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారిణి సులోచన రాణి
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా లోని ఇంటర్మీడియేట్ కళాశాలల్లో అశ్వారావుపేట జూనియర్ కళాశాల ఉత్తమంగా నిలుస్తుందని ఇంటర్మీడియేట్ విద్యాశాఖ జిల్లా అధికారిణి సులోచన రాణి కొనియాడారు. శనివారం కళాశాల ప్రెషర్ స్ డే నిర్వహించారు. స్థానిక ప్రిన్సిపాల్ ఎ.సాగర్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరు అయి ప్రసంగించారు. విద్యార్ధులు అకడమిక్ ఫలితాల్లో,ఇతరత్రా కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు,స్థానిక పెద్దలు,సేవా సంస్థలు కళాశాలకు ఇతోధిక సహాయం అందిస్తూ అభివృద్ధికి తమ వంతు కృషి చేయడం హర్షణీయం అన్నారు. స్థానిక ఎంపిపి శ్రీరామ మూర్తి మాట్లాడుతూ విద్యారంగాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుంది అన్నారు.ఇంటర్ విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులు జీవితం లో ఏదో రంగంలో స్థిరపడతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత్ ఫెర్రో ఎల్లాయిస్ మేనేజర్ శ్రీనివాస్, జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత యు.ఎస్ ప్రకాశ్ రావు,వాసవి క్లబ్ బాధ్యులు సుబ్బారావు పాల్గొన్నారు.