
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇప్పటి వరకు మేజర్ పంచాయితీ హోదా ఉన్న అశ్వారావుపేట ఈ నెల 25 నుండే పురపాలక సంఘం( మున్సిపాల్టీ )గా అవతరించడంతో పరిపాలనా కార్యాచరణ చకచకా కొనసాగుతుంది.ఈ క్రమంలో బుధవారం పంచాయితీ కార్యాలయం బదులుగా నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయం భవనం పై పురపాలక సంఘం కార్యాలయం అనే పేరుతో బోర్డ్ ను రాయించారు.మంగళవారం మే కమీషనర్ కే.సుజాత విధుల్లో చేరి ముఖ్యమైన రికార్డులను సీజ్ చేసి, పరిపాలనా పరం అయిన వ్యవహారాలు చక్కదిద్దడానికి ముగ్గురు అధికారులను నియమించారు. గురువారం ఈ మూడు పంచాయితీల కు చెందిన బ్యాంక్ ఖాతాలను రద్దు చేసి పురపాలక సంఘం పేరుతో నూతన ఖాతాలను ప్రారంభించనున్నారు. దీంతో అశ్వారావుపేట పురపాలన లోకి వచ్చేసింది.