
క్రీడల్లో ప్రత్యేకమైన తర్ఫీదు, వ్యక్తిగత ప్రోత్సాహం లేనప్పటికీ అంతర్రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో అశ్వారావుపేట లో మారుమూల గిరిజన విధ్యార్ధులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల అయిదు రోజులు పాటు ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్ధిని విద్యార్ధులకు అంతర్రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఈ కళాశాలకు చెందిన హెచ్.ఇ.సీ ద్వితీయ సంవత్సరం విద్యార్ధి ఊకే బాబూరావు రన్నింగ్, లాంగ్ జంప్ ల విభాగంలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. హెచ్.ఇ.సీ ప్రధమ సంవత్సరం విద్యార్ధిని తెల్లం స్వప్న చెస్ లో మూడో స్థానంలో నిలిచిన వీరు గోల్డ్ మెడల్స్ సాధించారు. సోమవారం ఈ విద్యార్ధులను ప్రిన్సిపాల్ సాగర్, బోధనా సిబ్బంది అభినందించారు.