టాప్‌లో అశ్విన్‌

టాప్‌లో అశ్విన్‌– ఐసీసీి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌గా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో అశ్విన్‌ తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ టాప్‌లో ఉండగా.. జస్ప్రీత్‌ బుమ్రా మూడోస్థానానికి స్థానానికి పడిపోగా.. కుల్దీప్‌ యాదవ్‌ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఇంతకుముందు ఈ స్థానంలో బూమ్రా కొనసాగాడు. అశ్విన్‌కు 870 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ 847 రెండో స్థానంలో, జస్ప్రీత్‌ బుమ్రా మూడోస్థానంలో కొనసాగుతున్నారు. కగిసో రబడ నాలుగు, పాట్‌ కమిన్స్‌ ఐదో స్థానంలో నిలిచారు. కుల్దీప్‌ 15స్థానాలను మెరుగుపరుచుకొని.. 16వ స్థానంలో నిలిచాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో రోహిత్‌, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ర్యాకింగ్స్‌ను మెరుగుపరుకున్నారు. రోహిత్‌ శర్మ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి, జైస్వాల్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో ఉండగా.. విరాట్‌ కోహ్లీ తొమ్మిదవ స్థానానికి పడిపోయాడు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ 21వ ర్యాంక్‌కు చేరుకోగా.. న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. జో రూట్‌(ఇంగ్లండ్‌) రెండో స్థానం, పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజం మూడో స్థానంలో, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ డారిల్‌ మిచెల్‌ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియాకు ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్‌ అల్‌ హసన్‌ మూడో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన రూట్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన జాసన్‌ హౌల్డర్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో అక్షర్‌ పటేల్‌ ఒక స్థానం కోల్పోయి ఆరో స్థానానికి చేరాడు.