నవతెలంగాణ – తాడ్వాయి
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్, మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ ధనుస్సరి సూర్య గార్ల ఆశీస్సులతో ములుగు జిల్లా వాసి అయిన అశ్వినీ రాథోడ్ గారు తెలంగాణలో జరగబోయే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా అశ్విని రాథోడ్ నామినేషన్ దాఖలు చేశారని వారిని అత్యధిక మెజార్టీతో మద్దతు తెలిపి, సభ్యత్వం పొందాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల రాజశేఖర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా గజ్జల రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జరగబోయే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా మన ములుగు జిల్లా వాసి మంత్రిగారి ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేశారని, జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్, అన్ని అనుబంధ సంఘాల నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు సహకరించి భారీ స్థాయిలో సభ్యత్వాలు చేర్పించి అత్యధిక మెజార్టీ తో ఆశీర్వదిస్తారని కోరారు.