ఏషియన్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనిల్ కుమార్ కు సన్మానం

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఈనెల 22 నుంచి 25 వరకు థాయ్ లెండ్ దేశములోని సకన్ నకన్ జిల్లాలో జరుగుతున్న  28వ ఏషియన్ మాస్టర్స్  అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2024 లో  చెందిన అంబోజు అనిల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్(45) సంవత్సరం ల  విభాములో (4) మేడల్స్ సాధించగా, శనివారం ఆయనను జిల్లా యోజన క్రీడల శాఖ అధికారి ధనంజయలు పూలమాల శాలువా తో ఘనంగా  సన్మానించారు. 4 x 400 మీటర్స్  రిలే విభాగం లో గోల్డ్  మేడెల్స్ సాదించగా,(3) కాంస్య పతకాలు, 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్లు, పరుగుపందంలో కాంస్యం పతకం సాధించిన్నట్లు తెలిపారు. కాగా గత సంవత్సరం లో కూడా ఆషియన్  మాస్టర్  సౌత్ కొరియా 3000 మీటర్ల విభాగములో గోల్డ్ మెడల్, 800 మీటర్ ల విభాగము లో   బ్రాంజ్ మెడల్, సాధించారని తెలిపినారు. రాబోయే రోజులలో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించినారు.  వీరిని ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని యువత వివిధ రకాలైన  క్రీడలలో పాల్గొనాలని కోరారు.