ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె అసీఫా భుట్టో జర్దారీ జాతీయ అసెంబ్లీ సభ్యురాలి (ఎంఎన్‌ఎ) గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆమె సోమవారం ప్రమాణ స్వీకారం చేసినట్లు స్థానిక మీడియా డాన్ తెలిపింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చైర్మన్, తన సోదరుడు బిలావల్ భుట్టో జర్దారీ తోడురాగా, పార్లమెంటులోకి ప్రవేశించి, ఎంపిగా ప్రమాణం చేసినట్లు పేర్కొంది. ఎంఎన్‌ఎ పార్టీ సభ్యుల నినాదాల మధ్య ఎన్‌ఎ స్పీకర్ అయాజ్ సాధిక్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ట్రెజరీ చట్టసభసభ్యులు వాకౌట్ చేశారు. గత నెల జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎ-207 షహీద్ బెనజీరాబాద్ (గతంలో నవాబ్‌షా) నుండి అసీఫా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అసీఫా భుట్టో తండ్రి ఆసిఫ్ అలి జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎంపికవడంతో .. ఆ స్థానం ఖాళీ అయింది.