
నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గం బాడీ మీటింగ్ తర్వాత ఏడపల్లి మండలంలోని జాన్కంపేట్ పర్మిట్ రూమ్ దావత్ లో చైర్మన్ తో పాటు ఇద్దరు డైరెక్టర్లు బహా బహికి పాల్పడిన సంఘటనపై నవ తెలంగాణలో “సొసైటీ దావత్ లో డిష్యుం డిష్యుం”అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితం కావడంతో నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సొసైటీ డైరెక్టర్ల మధ్య బాహా బహికి రాజకీయ కారణాల.. లేదా సొసైటీలో లావాదేవీల విషయం ఏమైనా ఉండవచ్చా మరి ఏదైనా కారణం కావచ్చా అని ఆరా తీస్తున్నారు. దీంతో సొసైటీ పాలకవర్గ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. స్థానికంగా ఈ విషయం ఎంతో చర్చనీయాంశ రాజకీయ అంశంగా మారింది.