సుధీర్ బాబు, హర్షవర్ధన్ దర్శకత్వంలో రాబోతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిసు ్తన్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ‘అడిగా అడిగా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ హదయాన్ని హత్తుకునే అమ్మ పాటను స్కోర్ చేశారు. ఈ పాట వినగానే భావోద్వేగానికి గురి చేస్తుంది, అమ్మతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. గీత రచయిత చైతన్య ప్రసాద్ భావోద్వేగాలను చాలా అద్భుతంగా వ్యక్తీకరించారు. పాటలో శ్రీనివాసన్ దొరైస్వామి వాయిస్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది అని చిత్ర బృందం తెలిపింది.