వేసవి కానుకగా ఆ ఒక్కటీ అడక్కు

వేసవి కానుకగా ఆ ఒక్కటీ అడక్కుహీరో అల్లరి నరేష్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. భరత్‌ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. టైటిల్‌ గ్లింప్స్‌ సినిమా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్‌ ఓ మేడమ్‌ కూడా మంచి ఆదరణ పొందింది. ఈరోజు మేకర్స్‌ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. ముందుగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ గురించి ఓ వివరణ ఇవ్వాలి. నాన్నగారి ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలాంటి సీక్వెల్‌ కాదు. నాన్నగారి సినిమాలో జీవితంలో సెటిల్‌ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథ. ఇందులో సెటిల్‌ అయినా పెళ్లి కాని వాడి కథ. చాలా హిలేరియస్‌ గా సినిమాని చేశాం. వింటేజ్‌ నరేష్‌ రావాలని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు చేయాలని కోరారు. చాలా ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనే ఉద్దేశంతో కథపై చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేశాం. నా బలం కామెడీ. ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం. మంచి కంటెంట్‌ వున్న కామెడీ ఎంటర్‌ టైనర్‌ ఇది. ఫారియా మంచి కామెడీ టైమింగ్‌ వున్న యాక్టర్‌. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష, హరితేజ ఇలా ఇందులో పాత్రలన్నీ అలరిస్తాయి. జామీ లివర్‌ తొలిసారి తెలుగులో నటిస్తున్నారు. ఈ సినిమాతో తను చాలా మంచి పేరు వస్తుంది. దర్శకుడు మల్లి గారు చాలా క్లియర్‌ విజన్‌ తో సినిమా తీశారు. కొత్త నిర్మాత రాజీవ్‌ గారు చాలా ప్యాషన్‌ సినిమాని నిర్మించారు’ అని కోరారు నిర్మాత రాజీవ్‌ చిలక మాట్లాడుతూ.. ఈవీవీ గారి టైటిల్‌ ని వాడుతున్నాం. మా మీద పెద్ద భాద్యత వుంది. ఆ టైటిల్‌ ఇచ్చిన నరేష్‌ గారికి ధన్యవాదాలు. చిలకా ప్రొడక్షన్స్‌ తొలి చిత్రమిది. నిర్మాత కావాలనే నా ఇరవై ఏళ్ళ కల. అది ఈ సినిమాతో తీరింది. మల్లి గారు చెప్పిన కథ చాలా నచ్చింది. అల్లరి నరేష్‌ గారి ఈ కథని నెక్స్ట్‌ లెవల్‌ కి తీసుకెళ్ళారు. నరేష్‌ గారు గ్రేట్‌ యాక్టర్‌. ఆయన ప్రతిభ చూసి సర్ప్రైజ్‌ అయ్యాను. ఆయనతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు. దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. టీజర్‌ ఎలా అయితే నవ్వుకుంటూ చూశారో ఈ సినిమా కూడా అలానే వుంటుంది. ఫ్యామిలీతో కలసి అనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది’ అన్నారు.