
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశ్రమ పాఠశాలల నెలవారీ సాదారణ సందర్శనలో భాగంగా ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్ధులకు సామాన్య శాస్త్రం,గణిత శాస్త్రం పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం ఇటీవల హాస్టల్ నుండి ఎవరికీ చెప్పాపెట్టకుండా తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన ఆరో తరగతి విద్యార్ధిని పై ఆరా తీసారు.ఆ సమయంలో క్లాస్ టీచర్ ను,వార్డెన్ ను,హెచ్.ఎం లను ఎక్కడెక్కడ ఉన్నారు?ఆ పాప అలా వెళ్తే ఎలా వెనక్కి తీసుకొచ్చారు?అనే విషయాలను ఆరా తీసారు.