రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: ఏ ఎస్ పి చైతన్య రెడ్డి

నవతెలంగాణ-భిక్కనూర్
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా ఏ ఎస్ పి చైతన్య రెడ్డి పోలీసులకు సూచించారు. శుక్రవారం మండలంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ఇండికేటర్ సిగ్నలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి జాతీయ రహదారిపై హైవే అథారిటీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.