నవతెలంగాణ – వేములవాడ: వేములవాడ నూతన ఎఎస్పీ శేషాద్రిని రెడ్డి గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.. వేములవాడ సబ్ డివిజన్ కు డిఎస్పి స్థాయి అధికారి విధులు నిర్వర్తించేవారు. కొత్తగా సబ్ డివిజన్ కు ఐపీఎస్ అధికారిని ఏఎస్పీ హోదాలో నియమించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆమె వెంట బదిలీపై వెళ్తున్న డి.ఎస్.పి నాగేంద్ర చారి తో పాటు తదితరులు ఉన్నారు.