ఆశావర్కర్లకు రూ. 8 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి

నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఎదుట జరుగుతున్న ఆశాల సమ్మెలో ఆదివారం ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, అర్బన్‌ ప్రాంతంలో గర్భిణులు మొదటి నెల నుండి డెలివరీ అయ్యే వరకు బాధ్యతగా పనిలోకి వచ్చిన ఆశాలు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి పనిని టీబీ, లెప్రసి, షుగర్‌, బీపీ, ఇతర అన్ని జబ్బులకు పరీక్షలు చేయించి మందులు ఇచ్చి సర్వీస్‌ చేస్తున్నారని తెలిపారు.గతంలో గర్భిణుల వరకే పని చేసి ఉదయం నుండి రాత్రి వరకు సమయం సందర్భంగా లేకుండా పని చేస్తూ ఒత్తిడికి గురువుతున్నారని వాపోయారు. చదువు లేకున్నా సరే అని మంత్రసాని పనితో మొదలై అనేక శిక్షణలు పొంది రికార్డులు రాసే పని కూడా చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆశావర్కర్ల పనిభారాన్ని దష్టిలో పెట్టుకొని వేతనం పెంచి పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. రిటైర్డ్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ రూ. 5 లక్షలివ్వాలని, అర్హత కలిగిన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్ర మంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత, రమణ, త్రివేణి,మణెమ్మ,లలిత,మంగ పాల్గొన్నారు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట 15 రోజులుగా సమ్మెలో భాగంగా ఆశాల సంఘం జిల్లా అధ్యక్షురాలు నకిరేకంటి కవిత ఆధ్వర్యంలో ఆదివారం భిక్షాటన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆశాల సంఘం మండల అధ్యక్షురాలు మామిడి లక్ష్మీ, గోవర్ధన, పద్మ, రాధ, సుజాత, లలిత, సైదమ్మ, ఇందిర, సత్యవతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.