మద్యం మత్తులో వ్యక్తిపై దాడి

నవతెలంగాణ-భిక్కనూర్
మద్యం మత్తులో వ్యక్తిపై దాడి చేసిన ఘటన భిక్కనూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్కనూరుకు చెందిన నరేష్ వైన్స్ ప్రక్కన ఉన్న పర్మిట్ రూంలో కూర్చొని తన స్నేహితుడితో ఫోన్ పోయిన విషయం మాట్లాడుతూ మద్యం సేవిస్తుండగా, ప్రక్కన కూర్చున్న మరో వ్యక్తి స్వామి నరేష్ మాటల మధ్యలో కలుగజేసుకొని బూతులు తిడుతూ చేతిలో ఉన్న సీసాతో నరేష్ తలపై దాడి చేశాడు. గాయాలైన నరేష్ ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నరేష్ ఫిర్యాదు మేరకు స్వామి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.