గంజాయి తాగడానికి తిరస్కరించాడని.. తోటి విద్యార్థులతో దాడి

నవతెలంగాణ – మాక్లూర్ 
గంజాయి సరఫరాతో పాటు వినియోగం గ్రామాల్లోకి ఎలా వ్యాపించిందో చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గంజాయి తాగడానికి తిరస్కరించాడాని ఓ విద్యార్థిపై తోటి స్నేహితులు దాడి చేసిన ఘటన మండలంలోని కల్లేడ గ్రామంలో చోటుచేసుకుంది.  కల్లేదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు బడి పనివేళలు ముగిసిన తర్వాత గ్రామ శివారుకు వెళ్లారు. అయిదుగురు స్నేహితులు గంజాయి తాగుతుండగా మరొక స్నేహితుడిని తాగాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. అతను తిరస్కరించడంతో వారందరూ కలిసి ఇష్టానుసారంగా అతణ్ని చితకబాదారు. చుట్టుపక్కల స్థానికులు అక్కడికి చేరుకోగానే అయిదుగురు విద్యార్థులు పారిపోయారు. స్పృహతప్పి పడిపోయిన విద్యా ర్దిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ఆసు పత్రికి తరలించారు.  స్కూల్ లో విద్యార్థులకు గంజాయి అలవాటు లేదు – ప్రధానోపాధ్యాయులు నాగరాజ్
కల్లెద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి గంజాయి ఆనవాళ్లు లేవని, విద్యార్థుల మధ్య దుర్గామాత నవరాత్రుల నుంచి గొడవలు ఉన్నాయని, దాని వల్లే విద్యార్థులు స్కూల్ సమయం అయిపోయిన తరువాత గొడవ పడ్డట్టు మా పరిశీలనలో తేలింది.