
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇప్పటికే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం ఎం.ఎల్.సీ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి ఉప ఎన్నికల షెడ్యూల్డ్ ను భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) మే 2 గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.మే 9 న నామినేషన్ లు ముగిసాయి. మే 27 న ఎన్నికలు జరగనున్నాయి.జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రులు నియోజక వర్గం,ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అశ్వారావుపేట అసెంబ్లీ నియోజక వర్గం,118,ఎస్టీ లో పట్టభద్రులు ఓటర్లు మొత్తం 5151 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3140 మంది ఓటర్లు ఉండగా,స్త్రీలు 2011 మంది పట్టభద్రులు ఓటర్లు. ఈ నియోజక వర్గం పరిధిలో 5 మండలాల్లో 5 రూట్ లుగా విభజించి 7 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఈ పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తహశీల్దార్ వి.క్రిష్ణ ప్రసాద్ తెలిపారు.
ఎన్నిక ఓటర్లు
అసెంబ్లీ 2023 1,55,962
పార్లమెంట్ 2024 1,59,174
ఎం.ఎల్.సీ గ్రాడ్యుయేట్ 5151