నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
మూడవ తెలంగాణ శాసనసభ రెండో సెషన్, శాసనమండలి 20వ సెషన్‌ను ప్రోరోగ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 8న ప్రారంభమైన సెషన్ జూన్27తో ముగిసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదంతో అసెంబ్లీ, కౌన్సిల్ ప్రొరోగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు.