ఇక మూడ్రోజులే అసెంబ్లీ…

Assembly is three days away...– సాయన్నకు నివాళి..
– సభ నేటికి వాయిదా
మరికొద్ది నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆఖరి అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల నాటికి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది కాబట్టి ఈ సమావేశాలే దాదాపు చివరివి కానున్నాయి. సభ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కాగానే.. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న మరణం పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించి, ప్రసంగించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సంతాప తీర్మానంపై ప్రసంగించారు. ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మరణం పట్ల సభ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అనంతరం స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్‌, బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ కాసేపు సరదాగా సంభాషించుకోవటం గమనార్హం. కాగా సమావేశాలను మూడు రోజులపాటు (ఆదివారం వరకూ) నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మరోవైపు శాసనసమండలిలో వర్షాలు, వరదలపై లఘు చర్చను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి… రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇటీవల మృతిచెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే గడ్డం సాయన్న మృధుస్వభావి, వివాదరహితుడనీ, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వును చెదరనివ్వకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ సమావేశమైన వెంటనే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుమతితో సీఎం కేసీఆర్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాయన్న నిజామాబాద్‌ జిల్లాలోని వల్లభాపూర్‌లో పుట్టారనీ, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారని చెప్పారు. 1983లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి ఐదుసార్లు శాసనసభ్యులుగా, హుడా డైరెక్టర్‌గా, టీటీడీ పాలకమండలి సభ్యులుగా, ఇతర అనేక హోదాల్లో ఉన్నతమైన పదవులకు వన్నెతెచ్చారని కొనియాడారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేదన్నారు. సాయన్న లేని లోటు తీరనిదన్నారు. ఆయన కూతురు లాస్యనందిత సైతం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా సేవలందించారని గుర్తుచేశారు. సాయన్న కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఆ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో కలిపించాలని చాలా ప్రయత్నం చేశారనీ, ఇదే అంశంపై తనకు పలుమార్లు లేఖలు కూడా రాశారని తెలిపారు. కంటోన్మెంట్‌ లో బలహీన వర్గాల కోసం ఇండ్లు కట్టించాలని తపించే వారన్నారు. కంటోన్మెంట్లను నగరపాలక సంస్థల్లో కలపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తు న్నట్టు తెలిసిందన్నారు. ఈ రకంగానైనా సాయ న్న కోరిక నెరవేరాలని ఆకాంక్షించారు. సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు ప్రశా ంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఎంఐఎం సభ్యులు సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యులు రఘునందన్‌ రావు, బీఆర్‌ఎస్‌ నుంచి దానం నాగేందర్‌, ముఠా గోపా ల్‌ మాట్లాడారు. వారంతా సాయన్నతో తమ కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవల్ని కొని యాడారు. సాయన్న మృతిపట్ల సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివా ళులర్పించింది. ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే విజ యరామారావు మృతి పట్ల సభ సంతాపం ప్రక టించింది. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
ఈటల-కేటీఆర్‌ ఆత్మీయ ఆలింగనం
శాసనసభ తొలిరోజు సమావేశంలో ఈటల రాజేందర్‌-మంత్రి కేటీఆర్‌ ఆత్మీయ ఆలింగనం హైలెట్‌గా నిలిచింది. సమావేశాల ప్రారంభానికి ముందు సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరి నొకరు పలుకరించుకున్నారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌..ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వద్దకెళ్లి ఏదో మాట్లాడుతుండగానే అక్కడకు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు అక్కడకు చేరుకున్నారు. ఆ ముగ్గురు మాట్లాడుతుండగా బాల్కసుమన్‌, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పోగయ్యారు. అదే సమయంలో ఈటల రాజేం దర్‌ సభలోకి వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చోబోతుండగా కేటీఆర్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ముందుకు రా అన్నట్టుగా లాగారు. దీంతో ఈట ల సీటు ముందువైపునకు వచ్చారు. ఈ సందర్భ ంగా కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ను ఆలింగనం చేసుకున్నారు. పద్మారావు కూడా ఈటలను ఆలి ంగనం చేసుకుని పలుకరించారు. వారంతా న వ్వుతూ ఏదో మాట్లాడుతుండగా సీతక్క దండం పెట్టుకుంటూ వారి వద్దకు చేరుకున్నారు.