– ఉమ్మడి జిల్లాలో జోరుగా అక్రమ డైలీ ఫైనాన్స్ వ్యాపారం
నవతెలంగాణ- సిరిసిల్ల
వడ్డీ జలగలు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు 100 రూపాయలకు ఐదు నుంచి పది రూపాయల వరకు వడ్డీ అక్రమంగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారు అవసరాల కోసం కొందరు ఆపద అత్యవసర సమయాల్లో మరి కొందరు అధిక వడ్డీ అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అప్పులు తీసుకుంటూ తిరిగి చెల్లించలేక ఆస్తులను తెగ నమ్ముకుంటున్నారు ఇటువంటి సామాన్య ప్రజల మధ్యతరగతి ప్రజల బలహీనతను అక్రమ వడ్డీ వ్యాపారులు నగదుగా మార్చుకుంటున్నారు రెట్టింపు వడ్డీని వసూలు చేసి నిలువు దోపిడి హైదరాబాద్ చేస్తున్నారు ఈ అక్రమ వడ్డీ వ్యాపారుల వల్ల కూరగాయల వ్యాపారులు చిరు వ్యాపారులు టాక్సీ ఆటో డ్రైవర్లు పండ్ల వ్యాపారులు యువకులు విద్యార్థులు చిక్కుకొని విలవిల లాగుతున్నారు అధిక వడ్డీకి ఇచ్చిన అప్పుకు సెక్యూరిటీగా వాహనాలు విలువైన సెల్ ఫోన్లు ఇతర ఆస్తుల కాగితాలను తాకట్టు పెట్టుకుంటున్నారు అధిక వడ్డీ వ్యాపారం కొందరు ప్రాణాలను బలి తీసుకుంటుండగా మరికొందరు కోట్ల ఆస్తులను కోల్పోతూ బజారున పడుతున్నారు అవసరానికి ఎక్కడ డబ్బులు లభించకపోవడంతో ఎంత వడ్డీ అయినా చెల్లించడానికి సిద్ధమై అప్పుగా తీసుకున్నవారు వడ్డీ చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంతకాలం కిందట ఇదేవిధంగా ఒక ప్రైవేటు విద్యాసంస్థ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది మూడేళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేయగా అనేకమంది పోలీసుల వలలో చిక్కారు లక్షల రూపాయలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు అలాగే అనేక డాక్యుమెంట్లను వడ్డీ వ్యాపారుల నుంచి అధికారులు బయటకు తీశారు వారిపై కేసులు కూడా నమోదయ్యాయి రోజు కష్టపడే కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు ఫుట్పాత్ వ్యాపారులు రోజువారీగా తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించడానికి వారి సంపాదన సరిపోకపోవడంతో చిరు వ్యాపారుల బతుకులు వడ్డీలతో చితికి పోతున్నాయి
వడ్డీ అక్రమ వ్యాపారంలో ప్రభుత్వ ఉద్యోగులు
ఉమ్మడి జిల్లాలోని ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్న ఈ అక్రమ వడ్డీ వ్యాపారంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది రోజువారి వడ్డీ వ్యాపారంలో పదివేల రూపాయలు అప్పుగా తీసుకుంటే ఇందులో ముందుగానే 1500 నుంచి 2000 వరకు తగ్గించి ఎనిమిది వేల నుంచి 8500 మాత్రమే అప్పు ఇస్తుంటారు ఇలా ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలు అప్పుకు 100 రోజుల్లో రోజుకు 100 రూపాయల వంతున 10000 వసూలు చేస్తున్నారు కూరగాయల వ్యాపారులు పండ్ల బండ్ల వ్యాపారులకు ఉదయం 900 అప్పు ఇచ్చి సాయంత్రం 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు రోజువారి అప్పు 100 రోజుల అప్పులకు ఒక గ్యారెంటీతో ప్రామిసరీ నోటు పై సంతకాలు తీసుకుంటున్నారు
అప్పు తీసుకున్న వారి నుంచే డాక్యుమెంట్ ఖర్చులు
లక్ష ఆపై అప్పులకు సెక్యూరిటీగా ఇండ్లు భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకోవడం ఆస్తులను మార్ట్ గేజ్ జిపిఏ లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం విలువైన వస్తువులను సెక్యూరిటీగా పెట్టుకుంటున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అప్పులు తీసుకున్న సందర్భంలో వారు ఏటీఎం కార్డులను ఈ వడ్డీ వ్యాపారులు వారి వద్దనే ఉంచుకొని వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ కాగానే డ్రా చేసుకుంటున్నారు వడ్డీ వసూలుకు సంబంధించిన ఖర్చులు కూడా అప్పు తీసుకున్న వారే భరించాల్సి ఉంటుంది వాయిదా ప్రకారం వడ్డీ అప్పులు చెల్లించని వారి ఇంటికి మనుషులను పంపిస్తూ వారి ఖర్చులను కూడా అప్పు తీసుకున్న వారి ఖాతాలో జమ చేస్తున్నారు ఒకసారి లోన్ రికవరీ కోసం వెళ్ళితే ₹1000 ఖర్చు కింద వసూలు చేస్తున్నారు అప్పులు వసూలుకు వడ్డీ వ్యాపారులు కొందరు ఏజెంట్లుగా నియమించుకొని వారిని అప్పు తీసుకున్న వారింటికి ఉదయమే పంపించి ఇంటి వద్దనే మకాం వేసి అవసరం అయితే బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా వసూలు చేస్తున్నారు అప్పులు తీర్చలేని సమయంలో వడ్డీ వ్యాపారుల వద్ద సెక్యూరిటీగా ఉన్న గ్యారెంటర్ పై ఒత్తిడి తీసుకురావడం అది సాధ్యం కాని సందర్భంలో ఇండ్లు భూములను ఆక్రమించడం చేస్తున్నారు అప్పుల ముసుగులో ఇంత దోపిడీ జరుగుతున్న బాధితులు చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఈ విషయం ఎవరికైనా చెబితే మళ్లీ అప్పులు ఇచ్చే వారు ఉండరని భయపడుతున్నారు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల పెద్దపెల్లి జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాల్సిన చిట్ రిజిస్టర్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆదాయపన్ను శాఖ పోలీసులు ఈ అక్రమ దందాపై దృష్టి సారించి సామాన్యుల నడ్డి విరుస్తున్న వడ్డీ దందాకు పులిస్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు