ట్రాన్స్కో సిబ్బందికి సహకరించండి..గృహజ్యోతికి అర్హులు కండి: ట్రాన్స్కో ఎఇ 

నవతెలంగాణ –  మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలో గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారి వివరాలను సేకరిస్తున్న కరెంట్ రీడింగ్ ట్రాన్స్కో సిబ్బందికి కరెంటు వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే గృహ జ్యోతి పథకానికి అర్హుల కోసం సహకరించాలని మద్నూర్ ట్రాన్స్కో ఏఈ కరెంటు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు అందించే పథకం కోసం, ప్రతి ఒక్కరు కరెంటు సిబ్బందికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అలాగే సెల్ ఫోన్ నెంబర్లు అందించాలని ఆయన కోరారు. మంగళవారం నాడు మద్దూరు మండల కేంద్రంలో ట్రాన్స్కో ఎఇ ట్రాన్స్కో, సిబ్బంది కలిసి గృహ జ్యోతి పథకం అమలు కోసం వినియోగదారుల నుండి వివరాలను సేకరించారు.