
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అసిస్టెంట్ డైరెక్టర్ (నర్సింగ్) విజయనిర్మల అన్నారు. బుధవారం నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని నర్సింగ్ ఉద్యోగులకు సూచించారు. అందిస్తున్న వైద్య సేవలపై నర్సింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నామని చీప్ నర్సింగ్ ఆఫీసర్ ఆమెకు తెలిపారు. కొత్తగా నర్సింగ్ ఉద్యోగాల్లో చేరిన నర్సింగ్ ఉద్యోగులు వైద్యం (చికిత్స) తీసుకుంటున్న రోగుల పట్ల సేవ భావంతో విధులు నిర్వహిస్తూ సేవలు అందించాలని సూచించారు. రోగులను తమ సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. తమను బాగా చూసుకుంటున్నారని తెలపడంతో నర్సింగ్ ఆఫీసర్ లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో నీలోఫర్ ఆసుపత్రి చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఎం హెచ్ లక్ష్మి, ఇందిర, డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్ లు కే పుష్ప, ఏ పద్మ, ఎం ఆశీర్వాదం, కే బాలమణి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ సువర్ణ ,ఐ సి ఎన్ ఏ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.