సైఫ్(SAIF) జోన్ అధికారులతో అసోచామ్ బి2బి సమావేశం

నవతెలంగాణ విజయవాడ: అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్ ), షార్జా ప్రభుత్వం, యూఏఈ  సహకారంతో మరియు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య మద్దతుతో  “యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం” శీర్షికన  బి2బి సమావేశాలు  విజయవంతంగా నిర్వహించింది. నోవాటెల్ విజయవాడ వరుణ్‌లో జూలై 17 నుండి జూలై 19, 2024 వరకు ఈ సమావేశాలు జరిగాయి.
యూఏఈ లోని షార్జా ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ (SAIF) జోన్ అందించే లాభదాయకమైన అవకాశాలను అన్వేషించాలనే ఆసక్తి కలిగిన , 70 కంటే ఎక్కువ కంపెనీలు ఈ కార్యక్రమం లో  పాల్గొనటం ద్వారా అద్భుతమైన స్పందన లభించింది. యూఏఈ మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలలో కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉన్న అనేక ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాల పట్ల  భారతీయ వ్యాపారాలకు అవగాహన కల్పించటం ఈ సమావేశాల యొక్క ప్రాథమిక లక్ష్యంగా వుంది.  ఈ సమావేశాల లో యూఏఈ లో  వ్యాపార/పెట్టుబడి అవకాశాలు, అక్కడ కంపెనీలు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, విదేశీ కంపెనీలకు లభించే  ప్రోత్సాహకాలు తో పాటుగా భారతీయ కంపెనీలు తమ మార్కెట్ పరిధిని ఎలా  విస్తరించుకోవచ్చో నిపుణులు వెల్లడించారు.
అసోచామ్  ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ మరియు యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి  రవి కుమార్ రెడ్డి కటారు ఈ కార్యక్రమం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు. బి2బి సమావేశాలు భారతీయ వ్యాపారాలు నేరుగా అధికారులతో నిమగ్నమవ్వడానికి ఒక ప్రత్యేక వేదికను అందించాయన్నారు. 70కి పైగా కంపెనీల నుండి ఉత్సాహభరితమైన భాగస్వామ్యం అంతర్జాతీయ మార్కెట్లకు యూఏఈ ని ఒక గేట్‌వేగా మార్చడానికి పెరుగుతున్న ఆసక్తిని నొక్కి చెబుతుందన్నారు.  భారతదేశం, యూఏఈ  మధ్య బలమైన ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను కొనసాగించాలనే నిబద్ధతతో ఈ కార్యక్రమం ముగిసింది.