విదేశీ పెట్టుబడిదారులతో అసోచామ్‌ సంప్రదింపులు

హైదరాబాద్‌: పలు విదేశీ పెట్టుబడిదారులతో అసోచామ్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో షార్జా ఎయిర్‌పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫ్రీ జోన్‌, షార్జ ప్రభుత్వం, యుఎఇ వర్గాల తో అసోచామ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం-యుఎఇ సిఇపిఎ ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి, ఇతర గల్ఫ్‌ దేశాలు, ఆఫ్రికా, యూర ప్‌ మొదలైన వాటిలోకి ప్రవేశించడానికి ఈ భేటీ దోహదం చేయనుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ కంపెనీలు తమ కార్య కలాపాలను విదేశీ మార్కెట్‌లలోకి ఎలా విస్తరించవచ్చో అర్థం చేసుకోవడానికి ఈ సమావేశాలు హైదరాబాద్‌ పరిశ్రమలకు సహాయపడ్డాయని తెలిపాయి. 70కి పైగా కంపె నీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారని అసో చామ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ రవి కుమార్‌ రెడ్డి కటారు తెలిపారు.