– ఎఫ్‌డీసీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ-గజ్వేల్
కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో తుగ్లక్ నాయకులు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో సీఎం మినీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ తుక్కుగూడలో ఇచ్చిన హామీలను తుక్కు తుక్కులేనని ఆయన విమర్శించారు. 70 సంవత్సరాల పరిపాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కీములో స్కాములు దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివద్ధి సంక్షేమం శూన్యమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేకుంటే ప్రాంతీయ పార్టీనా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలపాలన్నారు. రాష్ట్రానికో మేనిఫెస్టో విధానం ఉంటుందా అని విమర్శించారు. మీరు హైదరాబాద్ లో చెప్పిన హామీలన్నీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. వారంటీ లేని గ్యారెంటీ లేని హామీలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం దాహం కోసం ఢిల్లీ నాయకులు గల్లీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులన్నారు. కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఖతం చేస్తారన్నారు.