హైదరాబాద్ : 6వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు గోవాలో జరుగనున్నాయి. తెలంగాణ నుంచి 246 మంది మాస్టర్ అథ్లెట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, హాకి, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడల్లో తెలంగాణ మాస్టర్ అథ్టెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే తెలంగాణ అథ్లెట్ల జెర్సీని ఆదివారం బెల్ హాకి స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆల్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ వైస్ చైర్మన్ జగజీవన్ రెడ్డి ఆవిష్కరించారు.