క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. వీటి కోవలోనే ‘అసుర సంహారం’ చిత్రం రూపొందుతోంది. 750 చిత్రాలకు పైగా నటించి, మెప్పించిన తనికెళ్ల భరణి ప్రధాన పాత్రధారిగా ఇందులో కనిపించబోతున్నారు. ఈ మూవీని శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్ పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మించనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటిని కిషోర్ శ్రీకష్ణ హ్యాండిల్ చేయనున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టీవ్‌గా ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తుండగా, మిధున ప్రియ కీలక పాత్రని పోషిస్తున్నారు. విలేజ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ఓ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తనికెళ్ళభరణిని ఇందులో చాలా కొత్తగా చూడబోతున్నారు. ఈ సినిమా కోసం ఆయన మాకెంతో సహకారాన్ని అందిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాత : సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిధున ప్రియ, కెమెరామెన్:బాలు ఏబీసీడీ, సంగీతం : కరీం అబ్దుల్, ఆర్ట్ : దశరథ్, పాటలు : ఎస్ ప్రవీణ్ కుమార్, ఫైట్స్ : భరత్ కాళహస్తి, ఎడిటర్ : నరేంద్ర కుమార్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కిషోర్ శ్రీకష్ణ.