హైదరాబాద్ : ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, గేమింగ్ బ్రాండ్ ఎసుస్ ఇండియా మంగళవారం హైదరాబాద్‌లో తమ రెండవ ఆర్‌ఒజి స్టోర్‌ను ప్రారంభించింది. కొండాపూర్‌లో దాదాపు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో నోట్‌బుక్‌లు, ఆర్‌ఒజి పిసిలు, ల్యాప్‌టాప్‌లు, ఆల్ ఇన్‌వన్ పిసిలు, యాక్సెసరీస్, క్రియేటర్ సిరీస్‌లను అమ్మకానికి అందుబాటులో ఉంచింది. ఇది హైదరాబాద్‌లో తమకు 4వ స్టోర్ కాగా, తెలుగు రాష్ట్రాలలో మొత్తం 13 ఎఇఎస్ అండ్ ఒర్‌ఒజి స్టోర్లకు విస్తరించినట్లయ్యిందని ఏసుస్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ జిగేష్ భావ్‌సర్ తెలిపారు. దేశంలో 19 ఆర్‌ఒజి ప్రత్యేక అవుట్‌లెట్‌లను కలిగి ఉందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు.