– ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్
నవతెలంగాణ-చేవెళ్ల
ఎస్సీ కళాశాల హాస్టల్ ప్రారంభించని ఏఎస్‌డబ్లుఓ వెంకట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్, మండలాధ్యక్షులు సాయి గణేశ్ డిమాండ్ చేశారు. సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ బాలుర వసతి గహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కళాశాల వసతి గహాన్ని ప్రారంభించని ఏఎస్‌డబ్లూఓ వెంకట్‌ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కళాశాల హాస్టల్లో పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆశ్రమం పొందుతున్నారని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటూ గత ఆరు సంవత్సరాలుగా స్థానిక వసతి గహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఈ విద్యా సంవత్సరం కళాశాల హాస్టల్‌ను వెంకట్ నిర్లక్ష్యంగా హాస్టల్‌ను ప్రారంభించకుండా పేద విద్యార్థులు ఎస్సీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ఈ కుట్రను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఏఎస్‌డబ్ల్యూఓ వెంకట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.