మండలంలోని 17 గ్రామ పంచాయతీ ల పరిధిలో 26 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. పోలింగ్ సమ యం 7 గంటలకు కాగా వెంకట్రావు పేట గ్రామంలో 6:30 గంటలకు రెండు స్టేషన్ లలో ఓటర్లు బారు లు తీరారు. పోలింగ్ ప్రారంభం కాగానే లింగాపూర్ పోలింగ్ స్టేషన్ 115 కొద్దీ సేపు మాక్ పోలింగ్ కు, వర్ధరాజుపల్లి పోలింగ్ స్టేషన్ 114 ఈవిఎం మొర యించడంతో టెక్నీషియన్ సరి చేశారు. మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ లలో ఎలాంటి సమస్యలు లేకుండా పోలింగ్ సజావుగా సాగిందని తహసీ ల్దార్ శ్రీకాంత్ తెలిపారు.