బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో

At Brilliant Grammar High School– ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ప్రయివేటు పాఠశాలలో ఆదివారం శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి,ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాల శశిధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ”కృష్ణాష్టమి”గా వేడుక చేసుకుంటామని, శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా పేర్కొన్నారు. కృష్ణాష్టమిని “గోకులాష్టమి”, “అష్టమి రోహిణి”, “శ్రీకృష్ణ జన్మాష్టమి”, “శ్రీకృష్ణ జయంతి”, “శ్రీ జయంతి”, “సాతం ఆతం”, “జన్మాష్టమి” – ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారని తెలిపారు.చిన్నారులు కృష్ణుని,గోపికలు వేషధారణలో పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.