కనీసం 30 మందికి ఉపాధి కల్పించాలి : డీఆర్డీఏ అదనపు పీడీ ఎన్.రవి

నవతెలంగాణ – అశ్వారావుపేట వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి పని దినాలు పెంపొందించాలని, ప్రతీ పంచాయితీ నుండి కనీసం 50 నుండి 30 మంది నిరుపేదలకు పని కల్పించాలని డీఆర్డీఏ అదనపు పీడీ ఎన్.రవి అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక మండల పరిషత్ సమావేశ ప్రాంగణంలో మండల స్థాయి అధికారులు సమావేశంలో పలు పధకాలు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్ నాటికి నర్సరీలను సిద్దం చేయాలని,వేసవిలో మొక్కల సంరక్షణ చేపట్టాలని,వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్దం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మునగ సాగు లక్ష్యాలను చేరువ కావాలని,సాగు విస్తీర్ణం పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎంపీఈవో ప్రసాదరావు,ఈజీఎస్ ఏపీవో రామచంద్రరావు లు పాల్గొన్నారు.