ఈసారైనా..దామోదర గట్టెక్కేనా?

– ఇప్పటికే గ్రామాల్లో విస్తత పర్యటనలు గెలుపు కోసం తండ్రీకూతుర్ల ప్రణాళికలు
నవతెలంగాణ-పుల్కల్‌
ఆందోల్‌ నియోజకవర్గం నుంచి గత మూడు పర్యాయాలుగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన దామోదర్‌ రాజనర్సింహ.. గత రెండు పర్యాయాలుగా ఓటమిపాలయ్యారు. మొదటిసారి బాబు మోహన్‌ చేతిలో రెండోసారి చంటి క్రాంతి కిరణ్‌ చేతిలో ఓడిపోయారు. మూడోసారైనా నెగ్గుతారా లేక మళ్లీ ఓటమి పాలు అవుతారా అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఏది ఏమైనా ఈసారి గెలవాలని దఢనిశ్చయంతో దామోదర్‌.. ఆయన కూతురు త్రిష ప్రతీ మండలం.. ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలను చైతన్యం పరుస్తు న్నారు. దామోదర రాజనర్సింహ సంగారెడ్డి పట్టణంలోనే ఉంటూ.. అందోల్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులతో అనునిత్యం కలుస్తున్నారు. ఎలాగైనా గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తు లు వేస్తున్నారనే ఊహాగానాలు వినబడు తున్నాయి. బీఆర్‌ ఎస్‌లో ఉన్న అసమ్మతి నేతలను తమ పార్టీలో కలుపు కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 సాధా రణ ఎన్నికల్లో ఆందోల్‌ నియోజకవర్గం నుండి నెగ్గిన దామో దర్‌ రాజనర్సింహ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్య మంత్రి అయ్యారు కానీ.. అప్పుడు ఇక్కడి నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం కలవకుండా హైదరాబాద్‌కి అంకి తం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దాంతో ఇక్కడి నాయ కులు నిరాశ చెందడమే కాకుండా కొందరు నాయకులు ఇత ర పార్టీలలోకి వెళ్లిపోయారు. అలాంటి పొరపాట్లను మళ్లీ జరగనీయకుండా.. అనునిత్యం అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. తాను అదికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. కాగా మరోవైపు బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌ కూడా నిత్యం ప్రజల్లో ఉం టూ.. మరోమారు విజయ ఢంకా మోగించడానికి పథకాలు రచిస్తున్నారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరి స్తున్నారు. ఏది ఏమైనా నియోజ కవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ పోటాపో టీ ఎన్ని కల్లో ప్రజలు ఎవరికి పట్టం గడుతారో వేచి చూడాల్సిందే.