మండలంలోని ఇసన్న పల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సింధూర పూజలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసింది. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు, సిబ్బంది లక్ష్మణ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.