
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలానికి తీసుకున్న పంట రుణాల్లో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తలను చేయడం హర్షణీయమని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రూణమాఫీ ప్రకటించిన కాలయాపన చేసి ఎన్నికల అస్త్రంగా వినియోగించుకుందని..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామి ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించి రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని రత్నాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.