నాస్తికత్వం నిర్మాణాత్మక జీవన విధానమన్న ‘గోరా’

దేవుడు అబద్దం. మనిషిలో నీతి పెరగాలంటే అతని మనసులో దైవ భావన పోవాలి. ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరుగుతూ ఉంది. దానితో విద్వేషాలు పెరుగుతున్నాయి. దేవుడు కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా స్వచ్ఛమైన నీతిమంతుడైన మానవుడిగా మిగులుతాడు. ప్రజల మధ్య అడ్డుగోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చినప్పుడు సోదరభావం దానంతట అదే వెల్లివిరుస్తుంది. ప్రేమ, ఆప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది! – అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) ఆలోచనలు.
ఎవరీ గోరా? తెలుగు ప్రజలకు ఎందుకు ప్రియతముడయ్యాడూ? ఒరిస్సాలో పుట్టి, తమిళనాడులో చదివి, శ్రీలంకలో ఉద్యోగం చేసి, ఇటు క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ, అటు సర్వోదయ ఉద్యమంలోనూ పనిచేస్తూ జాతీయ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తగా ఢిల్లీ, అలహాబాద్‌లలో తిరిగిన తెలుగువాడు – గోరా. కృష్ణాజిల్లా విజయవాడను నాస్తిక కేంద్రంగా మలిచిన మొనగాడు – గోరా. ప్రపంచ నాస్తిక సభల్ని తెలుగునాట నిర్వహించిన ఒకే ఒక్కడు గోరా. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు – గోరా. పూర్తిపేరు గోపరాజు రామచంద్రరావు. ప్రపంచ దేశాలు పర్యటిస్తూ అంతర్జాతీయ నాస్తికోద్యమానికి ఊపిరినిచ్చిన గోరా, ఒకేసారి అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకవైపు మనువాదులు అలవాటు చేసిన అంధ విశ్వాసాలకు ప్రజలు బలై గిలగిల కొట్టుకుంటూ ఉన్నప్పుడు – మరోవైపు పరాయి పాలనలో దేశం దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్నప్పుడు – ఈ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడటం ఎలాగో నేర్పించిన ధీరోదాత్తుడు – గోరా! స్వాతంత్య్ర పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించినవారు చాలా మంది ఉన్నారు. కానీ వారు బతుకుల్ని నిర్వీర్యం చేసిన బ్రాహ్మణిజంపై పోరాడలేదు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వెళ్ళూనుకుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స – ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు అంటూ పిడికిళ్ళు బిగించిన వారు ఎవరూ దేవుణ్ణీ, దెయ్యాన్నీ పక్కనపెట్టి అసలైన మనిషిని వెతికి పట్టుకోలేదు. అందుకే చెప్పేది, మనిషిని గుర్తించిన వారందరూ మహనీయులే అయ్యారు. అవుతారు కూడా!
మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్న ఈ దైవ కేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి జీవితాంతం కృషి చేసిన మహౌన్నతుడు గోపరాజు రామచంద్రరావు (గోరా). వృక్షశాస్త్ర అధ్యాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధీజీ అనుచరుడు, జాతీయ స్థాయి కాంగ్రెస్‌ కార్య నిర్వాహకుడు. అస్పృశ్యతా నివారణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే – ప్రజల్లో కులమతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి. దేశంలో ఉన్నత విద్య సులభంగా అందుబాటులో లేని రోజుల్లో దాని కోసం తపించి, శ్రమించి స్నాతకోత్తర పట్టా సాధించిన వైజ్ఞానిక విద్యార్థి. ఉన్నత విద్యావంతుడై కూడా తన సుఖం తాను చూసుకోకుండా జనం కోసం జనం మధ్యలో తిరుగుతూ వారిలో వివేకాన్ని పెంచిన బాధ్యతగల పౌరుడు. గోరా నవ యువకుడిగా ఉన్నప్పటి నుండే – అంటే దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండే, సామాజిక కార్యాచరణకు పూనుకున్నారు. అనతి కాలంలోనే ఆయన చేపట్టిన సానుకూల నాస్తికత్వ (ూఉూ×ు×Vజు Aునజు×ూవీ) ప్రచారం అనేక మందిని ఆకర్షించింది. స్వచ్ఛందంగా అనేక మంది ముందుకొచ్చి ఆయన కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. క్రమంగా వాళ్ళే వాలింటర్లయి ఆయనకు తోడు నిలిచారు.
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చత్రపురంలో గోరా 1902 నవంబర్‌ 15న జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారావు. పుట్టింది ఉన్నత వర్గంలోనైనా ఆయన దానికి ఎన్నడూ విలువ ఇవ్వలేదు. పైగా కుల మతాల అడ్డుగోడలు తొలగించడానికే ఉద్యమించారు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్య, పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువు పూర్తిచేసి, మద్రాసు (తమిళనాడు) ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి దశలోనే విజయనగరానికి చెందిన సరస్వతిని పెండ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె వయస్సు పదేళ్ళు మాత్రమే. గోరా అనేక చోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధురలోని మిషన్‌ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్‌ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పనిచేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్లి కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడయ్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. స్వతంత్ర భావాలు గల గోరా ఎక్కడా ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేకపోయేవారు. నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీపడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయ వాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించుకుని, భార్య పిల్లలతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు.
సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని గోరా అనుకున్నారు. ఆ ఆలోచనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు. సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కులమతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని రూపొందించడానికి 1940లో కృష్ణాజిల్లా ముదునూరు లో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్‌ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధునిగా పనిచేస్తూనే సామాజిక, ఆర్థిక సమానత్వానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కులమతాల నిర్మూలనకు, అస్పృశ్యతా నిరన్మూలనకు, దళితుల ఆలయ ప్రవేశానికి, కులాంతర – మతాంతర వివాహాలు జరిపించడానికి నిరంతరం కృషి చేశారు – గోరా. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పనిచేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృతపరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందువయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత గోరా గారిదే! అప్పుడాయన వయసు 70 సంవత్సరాలు.
భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి? అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జులై 26న గోరా తుది శ్వాస విడిచారు. 2002లో గోరా శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా బిళ్ళ విడుదల చేసింది. గోరా మరణానంతరం ఆయన శ్రీమతి సరస్వతీ గోరా – నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్వహించారు. 2006లో సరస్వతీ గోరా మరణం తర్వాత 2020లో నాస్తిక కేంద్రం ఎనభై సంవత్సరాల మహౌత్సవాలు జరుపుకుంది.
ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భిణిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిది మంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. జనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి! రాహు-కేతువులు ఎక్కడో లేరు సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెపుతూ ఉండేవారు.
గోరా దంపతులు తమ పిల్లలకు పెట్టిన పేర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన కొడుక్కి ‘లవణం’ అని, భారతీయులు చట్ట సభల్లో గెలిచినప్పుడు పుట్టిన కొడుక్కి ‘విజయం’ అని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టిన కొడుకులకు సమరం, నియంత – అనీ తమ తొమ్మిదో సంతానానికి ‘నవ్‌’ (నౌ.9) అని, గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక జరిగిన సందర్భంలో పుట్టిన కూతురికి ‘మైత్రి’ అని, మరో అమ్మాయికి మనోరమ అనీ పేర్లు పెట్టారు. దేవుళ్ళ పేర్లు పెట్టుకునే జాడ్యం నుండి తెలుగువారిని కాపాడాలన్న ఉద్దేశంతో తమ సంతానానికి ఇలా ప్రత్యేకమైన పేర్లు పెట్టి చూపించారు. వీరి ప్రభావంతో చాలా మంది దంపతులు వారికి పుట్టిన పిల్లలకు దేవుడి పేర్లు పెట్టుకోవడం మానేశారు. అందుకే చూడండి… ఆధునికుల పేర్లు మానవ్‌, కౌశల్‌, వాత్సల్య, ప్రేమ, కారుణ్య లాంటివి కనిపిస్తున్నాయి.
సరస్వతి గోరా పూర్తిగా భర్తను అనుసరించి సంఘ సేవికగా మారారు. చిన్న వయసులోనే వివాహమైనా, అనతి కాలంలోనే ఆమె గోరా ఆలోచనల్ని అందుకుని ముందుకు నడిచారు. గోరా శ్రీలంకలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈమె అక్కడ నిప్పుల మీద నడిచి చూపించారు. అందులో దైవ మహిమలేవీ లేవని నిరూపించారు. అంతే కాదు, దేవదాసీ వ్యవస్థ నుంచి మహిళల్ని బయటికి లాగి, సరస్వతి గోరా వారికి వివాహాలు జరిపించారు. ఆమె క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కొన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జీవితాంతం బొట్టు, కాటుక, మంగళసూత్రాలు వంటివి ధరించకుండా మనువాద నియమాల్ని తిరస్కరించారు. గోరా మరణించినప్పుడు కూడా మతానికి సంబంధించిన కార్యక్రమాలేవీ లేకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రేమ, ఆప్యాయత, నైతికత మాత్రమే మానవత్వ లక్షణాలని గోరా దంపతులు చాటి చెప్పారు.
నిరంతరం కార్యరంగంలో శ్రమిస్తూనే, ఉపన్యసిస్తూనే గోరా నాస్తికత్వం మీద పత్రికలు – పుస్తకాలు ప్రకటించారు. స్వాతంత్రం లభించిన తొలినాళ్ళలో ‘సంఘం’ పేరుతో ఒక పత్రిక వెలువరించారు. 1968లో ‘ద ఎథీస్ట్‌’ అనే ఇంగ్లీషు మానపత్రిక ప్రారంభించి అంతర్జాతీయంగా ప్రపంచ నాస్తికుల ప్రశంసలు పొందారు. ఆయన రచించిన పదహారు పుస్తకాలలో సగం ఇంగ్లీషువి ఉన్నాయి AN ATHEIST WITH GANDHI (1951) POSITIVE ATHEIST (1972), THE NEED OF ATHEISM (1982) వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. నాస్తికత్వం (1941), దేవుని పుట్టుపూర్వోత్తరాలు (1951), నేను నాస్తికుణ్ణి (1976), సృష్టి రహస్యం (1976), ఆర్థిక సమానత్వం (1980), నాస్తికత్వం – ప్రశ్నోత్తరాలు వంటివి కూడా బహుళ జనాదరణ పొందిన రచనలు. ప్రతి ఒక్కరూ గోరా రచనలు చదవాలి. చదివించాలి. వాస్తవాలు చెప్పేవారు లేక ఈ తరం యువతీ యువకులు దారి తప్పిపోతున్నారు. పైగా, అబద్దాలు ప్రచారం చేసే ప్రభుత్వాలే అధికారం వెలగబెడుతున్నాయి గనుక, బాధ్యత గల పౌరులు చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంది. వచ్చే తరాలకు సరైన దిశానిర్దేశం చేయాల్సి ఉంది! (జులై 26 గోరా వర్థంతి)
– వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love
Latest updates news (2024-07-08 15:19):

jXt exhale cbd gummies near me | ISF does smilz cbd gummies work | 100mg cbd cream cbd gummies | online sale nosara cbd gummies | cbd gummies xYb give me a headache | trunature cbd gummies reviews 2FH | cbd tiM gummies 500mg high | full spectrum cbd gummies iU5 3000mg | where can you buy 44V cbd gummies in pensacola fla | cbd genuine gummies nh | keanu cbd for sale gummies | doctor recommended cbd kana gummies | GOh best tasting cbd gummy bears | cbd gummies dosage jqU for pets | octagon vR6 labs cbd gummies | zW8 freedom wellness cbd gummies | cbd 6vn gummies new brunswick | cbd mvN gummies and children | supreme cbd gummy bears DKO review | prime edibles azR cbd gummies | do cbd gummy bears 7X7 have thc | sunday scaries gummies CEF cbd | relief U2s roads cbd gummies | green roads world RH8 cbd gummies | chill cbd gummies 100x k8q from hookah town | cbd free shipping gummies charlottesville | cbd CUS gummies sleep uk | where to os7 buy cbd gummies uk | cheap DYv cbd gummies cali | are cbd gummies legal in VPm all states | pineapple online sale cbd gummies | cbd gummy laws U4S in us | shops that sell LSA cbd gummies | cbd gummies Toz spam texts | fire wholesale cbd cef gummy orange tincture | is taking cbd gummies good for you 6Lt | sUj cbd gummies legal in nj | just cbd 3Sm gummies 1000mg dosage | LSg do cbd gummies work for copd | best cbd gummies 2020 VCJ | AUg medix cbd gummies review | can you take hydrocodone and cbd gummies together zth | diamond cbd PEA relax gummies with melatonin | cbd full Dan spectrum gummies free shipping | genuine reassure cbd gummies | OwX cbd gummy bears delray florida | otter cbd oil cbd gummies | cbd gummies 7kk legal in wisconsin | cbd gummies pioneer 11j woman | Y7T garden of life extra strength cbd gummies