జూలై నుండి అథర్ 450 ప్లాట్‌ఫామ్ స్కూటర్ బుకింగులు ప్రారంభం

– రు. 129,999 ధరతో మొదలయ్యే 450S, నేడు అందుబాటులో ఉన్న 125cc పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే సర్వశ్రేష్టమైన సవారీ అనుభవాన్ని మరియు పనితీరును అందిస్తుంది
– జూలై నుండి బుకింగులు మొదలవుతాయి
– ఇప్పుడు సవరించబడిన ఫేమ్-II ఫ్రేమ్‌వర్క్ క్రింద 450X ప్రోడక్ట్ శ్రేణి కొరకు కొత్త ధరలను ప్రకటిస్తోంది
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి ఎలెక్ట్రిక్ స్కూటర్ తయారీదారు అయిన అథర్ ఎనర్జీ, దేశం లోని మరింతమంది ద్విచక్ర వాహన సవారీ దారులకు ఎంతగానో ఆశించబడిన పనితీరు-కేంద్రిత విద్యుత్ వాహన ప్రయాణాన్ని తీసుకువచ్చే ఒక కొత్త వేరియంట్ 450S విడుదలను ప్రకటించింది. 450S ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో శక్తి అందించబడి ఉంటుంది మరియు 115 కిలోమీటర్ల IDC (ఇండియన్ డ్రైవింగ్ పరిస్థితుల) రేంజ్ మరియు గంటకు 90 కిలోమీటర్ల టాప్ వేగం కలిగి ఉంటుంది.
కొత్త 450S, స్కూటర్ల ఔత్సాహికులలో అథర్ అంటే సుపరిచితమైన ఈ విభాగం యొక్క అత్యుత్తమ టెక్నాలజీని మరియు పనితీరును అందించడం కొనసాగిస్తుంది. రు. 129,999ల ప్రారంభ ధరతో 450S, ఇప్పుడు 125-cc పనితీరు గల ICE స్కూటర్లను కొంటూ ఉన్న, ఐతే మరింత చక్కని మరియు మరింత మెరుగైన పనితీరు కనబరుస్తున్న అథర్ స్కూటర్లకు మారాలనుకుంటున్న భారతీయ వాహన సవారీదారుల స్థోమతకు తగిన చేరువ లోపున ఉంది.
అథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకులు మరియు సిఈఓ శ్రీ తరుణ్ మెహతా గారు, ఇలా అన్నారు, “మాకు 450 ప్లాట్‌ఫామ్ ఎంతో విజయవంతం అవుతూ వస్తోంది, మరియు మేము మరింత ఎక్కువ మంది కొనుగోలుదారులకు దీనిని అందుబాటు చేయాలనుకుంటున్నాము. ఎలెక్ట్రిక్ వాహన విభాగం లోనికి ప్రవేశించాలనుకుంటున్న వారికి ఐతే అథర్ స్కూటర్లు అందించే నాణ్యత మరియు భరోసా కావాలని అనుకునే వారికి మా 450S కొత్త ప్రవేశ-స్థాయి వేరియంట్ అవుతుంది. ఈ విభాగం లోపుననే, 450S కొత్త మైదానాలను ఛేధిస్తుంది మరియు మంచి పనితీరును అందిస్తూనే, సవారీ సంతృప్తి మరియు భద్రత విషయంగా స్థాయిని పెంచుతూ తనదైన శైలి మొట్టమొదటి సాంకేతిక ఫీచర్లను అందిస్తుంది” అన్నారు.
దేశవ్యాప్తంగా అథర్ అనుభవ కేంద్రాలు కొత్త 450S కొరకు జూలై నుండి మొదలుగా బుకింగులను స్వీకరించడం ప్రారంభిస్తాయి, మరియు కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవడానికి తమ ఆసక్తిని అథర్ యొక్క వెబ్‌సైట్ పై వ్యక్తపరచవచ్చు https://atherenergy.com/450S. నేటి నుండి వర్తించే ఫేమ్ II సబ్సిడీ సవరణను అనుసరించి, అథర్ తన స్కూటర్ల ధరలను నేటి నుండి అమలు అయ్యే విధంగా సవరణ చేసింది. ఇండియాలో విద్యుత్ వాహనాల స్వంతదనాన్ని బాగా పెంచిన అతి ముఖ్యమైన కారకాంశాలలో ఒకటైన ఫేమ్ II సబ్సిడీ, kWh కి రు. 10,000 వంతున, ఎక్స్-ఫ్యాక్టరీ ధరకు గరిష్టంగా 15% పరిమితితో సవరించబడింది. “ఫేమ్ II సవరణ ఫలితంగా దాదాపుగా రు. 32,000 ల సబ్సిడీ తగ్గింపు జరిగింది. అయినప్పటికీ, దేశంలో విద్యుత్ వాహన అలవాటును త్వరితగతి చేయాలనే దృష్టితో తన కస్టమర్ల కొరకు అథర్ ఈ ధర ప్రభావం యొక్క భారీ వంతును తానే భరిస్తోంది. ఈరోజుతో మొదలై, అత్యుత్తమంగా అమ్ముడవుతున్న మా స్కూటర్ – 450X ప్రో ప్యాక్*తో రు.165,000 (బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర)కు లభ్యమవుతుంది, అది మార్చి 2023 ధరల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. మా కస్టమర్ల ప్రయోజనార్థము మేము సాధ్యమైనంత వరకూ ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నించాము మరియు ఫేమ్ II సబ్సిడీ తగ్గింపు అనంతరం పరిశ్రమలోనే అతి తక్కువ ధర పెంపుదలను నమోదు చేసుకున్నాము. 700W హోమ్ ఫాస్ట్ ఛార్జరు అందజేతతో కలుపుకొని అపారమైన ధర గ్రాహ్యత మరియు 3 kW వరకూ అథర్ గ్రిడ్™ ప్రాప్యత, సబ్సిడీ సవరణ అనంతరం ఒక పెంపుదల ధరను చెల్లించే కస్టమర్లకు అత్యంత విలువను జోడిస్తుంది” అన్నారు అథర్ ఎనర్జీ ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ రవనీత్ ఎస్. ఫోకేలా గారు. ఈరోజు నుండి మొదలై, అథర్ 450X రు. 145,000 (బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర) కు లభిస్తుంది మరియు ప్రో ప్యాక్* తో 450X రు. 165,000 (బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర) కు లభిస్తుంది.