60 నెలల ఈఎంఐతోనూ అథర్‌ ఎనర్జీ వాహనాలు

న్యూఢిల్లీ : తమ సంస్థ వాహనాలను 60 నెలల రుణ వాయిదాలతోనూ పొందవచ్చని ద్విచక్ర విద్యుత్‌ స్కూటర్ల తయారీదారు ఎథర్‌ పేర్కొంది. ఇవి స్కూటర్లను మరింత సరసమైనవిగా, సులభంగా పొందడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది. తమ నిర్ణయంతో రూ.2,999 నెల వాయిదాతోనే అథర్‌ ఎనర్జీ వాహనాలు పొందవచ్చని ఆ సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్‌ ఎస్‌ ఫోకేలా పేర్కొన్నారు. సాధారణంగా విద్యుత్‌ వాహనాలపై 36 నెలలు లేదా ప్రత్యేక పరిస్థితుల్లో 48 నెలల కంటే ఎక్కువ కాలావధి ఇవ్వడానికి వెనుకంజ వేస్తాయి.