ఏటీఎం పగలగొట్టి రూ.18.90 లక్షల చోరీ

– పాలమాకుల ఎస్‌బీఐ ఏటీఎంలో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్‌
ఏటీఎంలో మధ్య రాత్రి దొంగలు పడి పెద్ద ఎత్తున నగదు దోచుకెళ్లిన ఘటన శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శంషా బాద్‌ మండల పరిధిలోని పాల మాకుల గ్రామంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఏటీఎం నిర్వ హిస్తున్నారు. ఇందులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీఎం ఎస్‌ కంపెనీకి చెందిన నగేష్‌ అనే వ్యక్తి రూ. 21లక్షలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాలమా కుల గ్రామంలోని ఏటీఎం మెషిన్‌లో ఉంచాడు. అర్ధరాత్రి 01:59 గంటలకు పాలమాకుల ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌లో రూ. 18,99,900/-చోరీ జరిగింది. ఏటీఎంల భద్రతను పర్యవేక్షిస్తున్న కాల్‌ సెంటర్‌ నుంచి తమకు కాల్‌ వచ్చిందని, ఆ సమాచారం మేరకు వారు శంషాబాద్‌కు పోలీసు లకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఏటీఎం తలుపులు పగలగొట్టి ఉన్నాయి. అందులో నికర నగదు దొంగతనం జరి గింది. ఏటీఎంలో అంతకు ముందు రూ.2,00, 100/- వరకు విత్‌ డ్రా చేశారు. మిగిలిన డబ్బులు. రూ. 18,99, 900/-దొంగి లించబడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్‌కట్టర్‌ సహాయంతో మిషన్‌ పగల గొట్టారు. వి- సాట్‌ మోడ ల్‌ బాక్సులు ధ్వంసం చేశారు. ఈ విష యంపై బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.