
మండల కేంద్ర శివారులోని 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ సిసి రాజశేఖర్ తన సొంత వాహనంలో హైదరాబాద్ వెళుతున్న సమయంలో బ్యాటరీ లోపంతో టోల్ ప్లాజా సమీపంలో నిలిచిపోయింది. కారును పక్కకు పెట్టి మెకానిక్ వద్దకు వెళ్లి వచ్చేసరికి కారుకు సంబంధించిన డోరును ఓపెన్ చేయడమే కాకుండా తమపై సిబ్బంది దాడి చేశారని రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేస్తు పోలీస్ స్టేషన్‌లో టోల్ ప్లాజా సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.