లక్ష్యం కోసం నిర్విరామ కృషి అవసరం.. ఏ టి ఎస్ శ్రీనివాస్

– మెరిట్ సాధించిన విద్యార్థినిలకు బంగారు ఉంగరాల బహుకరణ
– ఆకట్టుకున్న ఏటిఎస్ మోటివేషనల్ స్పీచ్ 
నవతెలంగాణ -ఎడపల్లి: లక్ష్యం సాధించాలంటే నిర్విరామ కృషి అవసరమని సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటిఎస్ శ్రీనివాస్ అన్నారు ఎటుపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో పది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మెరిట్ సాధించిన విద్యార్థినిలకు బంగారు ఉంగరాలను సోమవారం బహూకరించారు ఈ సందర్భంగా ఏడవ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థినులకు ఏ డి ఎస్ శ్రీనివాస్ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కావలసిన సూత్రాలను తెలియజేశారు. ముఖ్యంగా సమయం యొక్క విలువను విద్యార్థులు గుర్తించాలని అన్నారు. గురువులను, పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలని, మహనీయుల జీవిత చరిత్రలతో స్ఫూర్తిని పొందాలని అన్నారు. కటోర శ్రమ, కచ్చితత్వం, ముందుచూపుతో ఉంటే విజయాలు దరిచేరతాయని అన్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగీ ఆదర్శంగా ఉన్నటువంటి ఏటీఎస్ శ్రీనివాస్ తమ విద్యార్థులకు ప్రేరణ కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపి పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పి వైస్ చైర్మన్ రజిత యాదవ్, సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, ఎంపీటీసీ వనజ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.