న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్‌తో క్విడ్‌ప్రోకోకు పాల్పడి.. వ్యాపారాలను దివాళాగా మార్చుకున్న వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణు గోపాల్ దూత్‌కు సెబీ భారీ షాక్ ఇచ్చింది. సెబీకి చెల్లించాల్సిన రూ.5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకోవడానికి ఆయన బ్యాంక్, డీమాట్, మ్యూచువల్ ఫండ్ ఖాతాలను, లాకర్లను అటాచ్ చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవీలకు అవకాశం కల్పించరాదని సంబంధిత బ్యాంక్‌లు, సంస్థలను ఆదేశించింది. పలు కంపెనీల్లో వేణు గోపాల్ దూత్‌కు ఉన్న పెట్టుబడులను వెల్లడించకుండా.. నిబంధనలు ఉల్లఘించిన కేసులో సెబీ రూ.5 లక్షల జరిమానా చెల్లించగా.. ఆ మొత్తాన్ని చెల్లించడంలో దూత్ విఫలమైనందున తాజాగా చర్యలు తీసుకుంది.
వీడియోకాన్ ధూత్ ఖాతాల అటాచ్‌మెంట్
1:53 am