బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి అమానుషం..

Attack on BRS office is inhuman..నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఎన్ఎస్యుఐ రౌడీ మూకలు చేసిన దాడిని నిరసిస్తూ ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షకు మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.మీడియాతో మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ అండతో,స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో రౌడీ మూకలు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అన్నారు.పోలీసుల సమక్షంలో వారి సహకారంతో ఈ దాడి జరగడం నిజంగా ఆప్రజాస్వామికంగా భావించారు.ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ సర్కార్ ప్రవర్తిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటని అన్నారు.బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు నమోదు చేయకుండా రేవంత్ రెడ్డి పోలీసులు కాంగ్రెస్ పార్టీకే కొమ్ముకాస్తున్నారని అన్నారు. BRSకార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వచ్చే మా ప్రభుత్వంలో కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతాం అని అన్నారు. CC టీవీ ఫుటేజ్,వీడియోలు అన్ని భద్రపరచి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటం అని అన్నారు.పోలీసులు తక్షణమే స్పందించి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.