నవతెలంగాణ – అశ్వారావుపేట
భూ వ్యవహారంలో కలుగ జేసుకుంటున్నాడని ఒక కాంగ్రెస్ నాయకుడి పై దాడి జరిగింది.బాధితుడు సత్యనారాయణ చౌదరి పిర్యాదు మేరకు ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ యయాతి రాజు తెలిపిన వివరాలు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ చౌదరి మంగళవారం తహశీల్దార్ కార్యాలయం నుండి మూడు రోడ్లు ప్రధాన కూడలికి చేరుకోగానే పేలాయి గూడెం కు చెందిన గుర్రాల సాయి కారును అడ్డగించి మా భూమి విషయంలో ఎందుకు కలుగ జేసుకుంటున్నావంటూ దాడికి పాల్పడ్డాడు.బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.