హెడ్‌ కానిస్టేబుల్‌పై ఆకతాయిల దాడి

నవతెలంగాణ-గీసుగొండ
ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై ఆకతాయిలు దాడిచేసిన సంఘటన వరంగల్‌ మహానగర పరిధిలోని 16వ డివిజన్‌ ధర్మారంలో చోటు చేసుకున్నది. సీఐ మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మమునూర్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భిక్షపతి దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ధర్మారంలో బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా నలుగురు ఆకతాయిలు హెడ్‌ కానిస్టేబుల్‌ను దూషిస్తూ మొబైల్‌ లాక్కొని కొట్టారు. భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ నలుగురు పరారీలో ఉన్నారన్నారు.