జర్నలిస్టులపై దాడి అమానుషం

– టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ – గుండాల
జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని గుండాల టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.బాలస్వామి, ఎల్.రూప్ సింగ్ అన్నారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జర్నలిస్టుపై దాడి  ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన పత్రికా రంగాన్ని, పాత్రికేయులను కించపరచడం చాలా దారుణమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.