– కాలంచెల్లిన మందుల స్వాధీనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సికింద్రాబాద్ తార్నాకలోని కందార్ డయాబెటిక్ సెంటర్‌పై డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో చట్ట విరుద్ధంగా నిల్వ ఉంచిన ఫిజీషి యన్ శాంపిళ్లతో పాటు కాలం చెల్లిన మందులను సీజ్ చేశారు. వీటి విలువ రూ.55 వేలు. ఈ దాడిలో 9 రకాల ఫీజీషియన్ శాంపిళ్లను, ఆరు రకాల కాలం చెల్లిన మందులను గుర్తించారు. ఫిజీషియన్ శాంపిళ్లు, కాలం చెల్లిన మందులను నిల్వ ఉంచితే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ కింద జరిమానాతో పాటు అత్యధికంగా రెండేండ్లు జైలు శిక్ష పడుతుందని డ్రగ్ కంట్రోల్ అథా రిటీ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్ రెడ్డి హెచ్చరిం చారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా మందులను నిల్వ ఉంచితే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1800 -599 – 6969కు కాల్ చేయాలని సూచించారు.