– దాడి చేసిన కుటుంబ సభ్యులపై కేసు నమోదు
నవతెలంగాణ – శాయంపేట
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తల్లిదండ్రులు దాడి చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సిహెచ్. ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హనుమకొండ పట్టణానికి చెందిన బైరి నిఖిల్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన దానవీని మణి నీ ప్రేమించి, ఈనెల 16న చిల్పూర్ గుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని హనుమకొండ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా అమ్మాయి వాళ్ళ మేనమామ, సోదరుడు వచ్చి వారితో మాట్లాడినప్పుడు అమ్మాయి తన ప్రేమించిన అబ్బాయి తోనే వెళ్తానని చెప్పినట్లు తెలిపారు. వాళ్ళ అమ్మ, నాన్నతో ఫోన్లో మాట్లాడిన మణి తనకు పెళ్లి ఇష్టమని, రాను అని చెప్పినది. దీంతో ప్రేమ జంటను కలిపి పంపించి వేశారు. నిఖిల్ హనుమకొండలో ఉంటే సరికాదని, తన అమ్మమ్మ ఊరు పత్తిపాక గ్రామానికి అమ్మాయిని తీసుకొని వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నిఖిల్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లి ప్రేమ జంట పైన దాడి చేసి అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అదే సమయంలో 100 డయల్ కు కాల్ రావడంతో వెంటనే శాయంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, అక్కడ జరిగే గొడవను సద్దుమణిగ చేశారు. జరిగిన సంఘటనపై బైరి నిఖిల్ ఫిర్యాదు మేరకు అమ్మాయి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు.