మట్కా స్తావరంపై దాడి

– ముగ్గురి వ్యక్తుల  అరెస్టు
నవతెలంగాణ – కంటేశ్వర్ 
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో మటక స్థావరంపై దాడి నిర్వహించగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు మంగళవారం తెలిపారు. ఎస్ హెచ్  విజయ్  బాబు తెలిపిన వివరాల ప్రకారం..కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చి కాంపౌండ్ లోని ఆన్లైన్ లో మట్కా నిర్వహిస్తున్న మొహమ్మద్ ముజాహిద్, షేక్  హమీద్, షేక్ నాజర్ అను వ్యక్తులను టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్  పురుషోత్తము వారి బృందం దాడి చేసి   అరెస్ట్ చేసినట్లు వివరించారు.వారి వద్ద నుండి రూ.29,690/- నగదును, 3 మొబైల్స్ ని స్వాధీన పరుచుకున్నామన్నారు. అనంతరం వారిని టౌన్ వన్ పి. ఎస్ నిజామాబాదుకు తరలించారు అని తెలియజేశారు.